Dussehra Precautions
దశరా మరియు బతుకమ్మ పండుగల సందర్భంగా
మనము ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాల గురించి వింటున్నాము. మరి వీటికి కారకులేవరు అని విశ్లేషిస్తే ప్రదానముగా మానవ తప్పిదము వల్లేనే ఎక్కువ జరుగుతున్నవని తేలింది. మనము ఇప్పుడు దశరా మరియు బతుకమ్మ పండుగ జరుపుకునే సంతోశములో బంధువులతో, మిత్రులతో మన స్వంత ఊర్లకు ప్రయాణము చేస్తాము కాబట్టి మన ప్రయాణం సుఖప్రదము మరియు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ప్రయాణము చేసేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని మరియు మీ బంధు మిత్రులు కుడా జాగ్రత్తలు తీసుకునేటట్లు వారికీ కూడా ఈ క్రింది భద్రతా నియమాలని వివరిస్తారని ఆశిస్తూ మీ రోడ్డు సేఫ్టీ క్లబు. www.meetup.com/ROADSAFETYCLUB.
1. Over Speed అధిక వేగము:
ప్రమాదాలకు ప్రధాన కారణము అతి వేగము, దయచేసి అతి వేగముతో వాహనాలను నడుపకండి. రోడ్లన్నీ ఎక్కువ వాహనాలతో, పాదచారులతో మరియ ఇతర ట్రాఫిక్ తో క్కికిరిసి ఉంటాయి కాబట్టి మన వాహనము నియంత్రణలో ఉండి ప్రమాదము జరుగకుండా నియంత్రించడానికి అలర్ట్ గా ఉండండి.
2. Improper overtaking సరిగా ఓవర్టేక్ చేయక పోవటము.
వంపుల వద్ద, మీకు రోడ్డు కొంత దూరము వరకు కనబడని చోట, ఎదురుగా వాహనాలు దగ్గరగా ఉన్నప్పుడు, ఇతర అడ్డంకులు ఏమైనా ఉండి మనకు రోడ్డు సరిగా కనబడనప్పుడు ఓవర్టేకు చేయరాదు.(తేది 07/10/2015 రోజున నల్గొండ జిల్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము ములమలుపులోనే జరిగింది, ఇందులో బస్సులో ప్రయాణిస్తున్న అమాయక ప్యాసింజర్లు 9 మంది మరియు డ్రైవరు చనిపోయారు)
3. Drunken Driving మత్తు పదార్థములు సేవించి నడుపటం:
కొంత మంది మిత్రులతో కలసి వెళ్ళినప్పుడు ఆనందిచడానికి మత్తుపదార్థములు తీసుకోవడము జరగుతుంది. దయచేసి మత్తు మందులు సేవించి వాహనమును నడుపకండి. ఎవరైనా డ్రైవరును తీసుకొని వెళ్ళండి లేదా అక్కడే విశ్రాంతి తీసుకొండి.
4. Cell phone driving మొబైల్ ఫోనులో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం:
వల్ల రోడ్డుపై నుండి దృష్టి మరలడము వల్ల ప్రమాదము జరుగవచ్చు. ఎల్లప్పుడు డ్రైవరు దృష్టి రోడ్డుపైన ఉంచి డ్రైవ్ చెయ్యండి. సెల్ ఫొనె కాదు ఇంకా ఈ క్రిందివి చర్యలు కూడా మీ దృష్టిని రోడ్డుపైనుండి మరల్సుతుంది.
చిన్నారుల అల్లరి
నీల్ల బాటిల్ తీయడము
రేడియో లేదా సి.డి. ప్లేయర్ ఆపరేట్ చేయడము
స్క్రీనుపై సినిమా చూడడము
పక్క వారితో వాదించడము
రోడ్డ్డు ప్రక్కల గల బోర్డులను, జరుగుతున్న సంఘటనలను తీక్షణంగా చూడడము
ప్రతి ఒక్క క్షణము కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైనది. గంటకు 100 కిలోమీటర్ల వేగముతో వెళ్తున్న వాహనము ఒక్క సెకండ్లో 28 మీటర్ల దూరము ప్రయాణిస్తుంది, అందువలన మీరు ఎల్లప్పుడూ రోడ్డుపైన దృష్టి పెట్టి వాహనాన్ని నడుపగలరు.
5. Fatigue (పని ఒత్తిడి వల్ల):
ప్రతి రెండు గంటలకొకసారి కొంతసేపు ఆగి ప్రయాణం చేయవలెను: ముందు రోజు రాత్రి సరిగా విశ్రాంతి తీసుకొని ప్రయాణము చేయండి
6. Lane driving లేను డ్రైవింగ్: ఓకే లేనులో ప్రయానించండి, ఓపికతో కొంత సేపు ఆగండి. ఆగకుండా ప్రక్కనుండి ముందుకువెళ్ళితే అది ట్రాఫికు జాములకు దారితీస్తుంది.
7. Wear Seat belt:
కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు ధరించండి ఇది ప్రమాదము జర్గినప్పుడు ఎక్కువ గాయాలు కాకుండా కాపాడుతుంది.
8. Wear Helmet:
మోటారు సైకిల్ పై ప్రయాణించేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించండి. మోటారు సైకిల్ ప్రమాదాలలో ఎక్కువగా చనిపోయేవారు తలకు గాయాల వలన. హెల్మెట్ తలకు గాయము కాకుండా కాపాడుతుంది.
9. మీ వాహనానికి మరియు మీ ముందు వాహనానికి తగినంత దూరములో నడుపండి.
మీరు తగినంత దూరములో ఉన్నారో లేదో తెలుసుకోడానికి ఈ క్రింది రెండు సెకన్ల రూలు పాటించండి.
మీ ముందు వాహనము ఏదైనా ఒక స్థిరమైయిన వస్తువును దాటుతున్నప్పుడు “ఒక వెయ్యి ఒక్కటి, ఒక వెయ్యి రెండు అని లెక్కించండి, ఇంతలో మీరు ఆ వస్తువును దాటినట్లైతే మీరు రిస్కులో ఉన్నట్లు. వేగము తగ్గించి మీ ముందు వాహనానికి మీకు దూరాన్ని పెంచండి.
10. బస్సులోనుండి దిగిన తర్వాత
బస్సు వెళ్ళే వరకు ఆగి రోడ్డు దాటండి లేదా బస్సు నుండి కొంత దూరము వెళ్లి మీకు ఇతర వానలు కనబడేటట్లు మీరు ఆ వాహన డ్రైవర్లకు కనబడేటట్లు రోడ్డు దాటండి.
11. బస్సులలో ప్రయాణించేటప్పుడు
అప్రమత్తంగా ఉండండి. దాబాలలో ఆగినప్పుడు డ్రైవర్లను గమనిచండి. డ్రైవర్లు ఏమైనా మట్టుమందులు తీసుకున్నట్లు మీకు అన్పిస్తే వెంటనే దగ్గరి పోలీసుకు 100 కు ఫోనేచేసి మీ వాహనము నంబరు, మీరు ఉన్న ప్రదేశము, మీరు వెళ్తున్న దిక్కు వివరాలు ఇవ్వండి.
12. బస్సులో పొగ గాని, కాలుతున్న వాసన
వచ్చినట్లయితే వెంటనే డ్రైవరును అప్రమత్తము చేయండి./